Thursday, 24 October 2019

దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ.. సెక్సీ దిషా పటానీ

‘దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ’.. ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్.. సమంత అందానికి పడిపోయి పాడుకున్న పాట ఇది. కానీ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఇప్పుడు కుర్రకారు ఇదే పాటను పాడుతూ ఆమె బ్యూటీకి ఫిదా అవుతున్నారు. దిషా పటానీ సినిమాల పరంగా అంత క్రేజ్ లేదు. కానీ సోషల్ మీడియాలో ఆమె తనకు తానే సాటి నిరూపించుకుంది. సెక్సీ ఫొటో షూట్లతో, మత్తెక్కించే క్లీవేజ్‌తో కుర్రాళ్ల మతిపోగొట్టేస్తుంటుంది. తాజాగా దిషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ కాల్విన్ క్లైన్‌కి దిషా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ బ్రాండ్‌కు సంబంధించిన ఇన్నర్ వేర్ ధరించి ఫొటో షూట్లలో తెగ పాల్గొంటోంది. హాట్ హాట్ పోజులతో సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోంది. తాజాగా ప్యాంట్ జిప్ తీస్తున్నట్లు ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయ్యేలా ఉంది. ఇప్పటికే ఈ ఫొటోకు 17 లక్షల మందికి పైగా లైక్ కొట్టారు. వాట్ ఎ ఫిగర్, సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దిషాకు జిమ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే దేవకన్యలాంటి రూపం ఆమె సొంతమైంది. ఆమెలాంటి బాడీ ఫిగర్ కావాలని కోరుకోని అమ్మాయి ఉండదు. జిమ్‌లో క్లిష్టమైన కసరత్తులను కూడా చేస్తుంటుంది. ఫిట్‌నెస్ పరంగా దిషా ఎందరికో రోల్ మోడల్.

ఇక దిషా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ‘మలంగ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించనున్న ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. దిషా తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది తెలుగు సినిమాతోనే అయినా ఆమెకు బాలీవుడ్ బాగా కలిసొచ్చింది. కాబట్టి ఇప్పుడిప్పుడే దిషా తెలుగు ప్రేక్షకులను పలకరించేలా లేదనే చెప్పాలి. దిషాకు సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ వల్లే ఆమెను వివిధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఎంచుకుంటున్నారు. దిషా సోషల్ మీడియాలో ఒక బ్రాండ్‌కు సంబంధించిన పోస్ట్ చేస్తే కోట్లు కుమ్మరిస్తామని స్పాన్సర్లు ముందుకొస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Ljmge
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...