Thursday, 24 October 2019

నన్ను ముట్టుకున్నావంటే మీటూ కేసు పెడతా: నటి బెదిరింపులు

ప్రముఖ హిందీ బుల్లి తెర నటుడు సిద్దార్థ్ శుక్లాపై యావత్ బాలీవుడ్ ఆగ్రహంగా ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో మరో మహిళా కంటెస్టెంట్‌ను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అది కాస్త రచ్చగా మారింది. ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు సాంప్ సీడీ అనే టాస్క్ ఇచ్చారు. దేవోలినా అనే కంటెస్టెంట్ తన టీంతో కలిసి నిచ్చెన పేర్చుతుంటే సిద్ధార్థ్ టాస్క్ పాడుచేయడానికి ప్రయత్నించాడు. దాంతో దేవోలినా సిద్ధార్థ్‌పై మండిపడింది. అంతేకాదు తనను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీటూ ఆరోపణలు చేసి కేసుపెడతానని బెదిరించింది. దాంతో ఈ విషయం కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. సిద్ధార్థ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన రోజే ఓ యువతితో గొడవపడ్డాడు. హౌస్‌లోని ఇతర ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఓ బుల్లి తెర నటి సిద్ధార్థ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ‘బాలికా వధు’ సీరియల్‌తో పాపులారిటీ తెచ్చుకున్న సిద్ధార్థ్.. ఇదే సీరియల్‌లో తనకు భార్యగా నటించిన షీతల్ ఖందేల్ అనే నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె మీడియా ముందు బయటపెట్టింది. సెట్‌లో షూటింగ్ నెపంతో తనను ఎక్కడపడితే అక్కడ పట్టుకున్నాడని తెలిపింది. దాంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సిద్ధార్థ్‌ను బిగ్ బాస్ నుంచి తొలగించాలని, అతన్ని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క దేవోలినా మీటూ పేరుతో సిద్దార్థ్‌ను బెదిరించడం కూడా వివాదాస్పదమవుతోంది. మీటూ పేరు చెప్పగానే అందరూ తనని నమ్మేస్తారనుకుని అనవసరంగా ఈ ఉద్యామన్ని మిస్యూస్ చేసుకోవాలని చూస్తోంది. తెలుగులో ప్రసారమైన ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్‌లో దేవోలినా గోపిక పాత్రతో బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ తెలుగులోనూ ఏడేళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. ఆమెకున్న పాపులారిటీ చూసి సల్మాన్ బిగ్ బాస్‌లో అవకాశం ఇచ్చాడు. కానీ దేవొలినా సెన్సిటివ్ ఇష్యూ అయిన మీటూను తన వ్యక్తిగత విషయాల కోసం వాడుకోవాలని చూస్తోందని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JjHmk4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...