Thursday, 24 October 2019

తెలిసిపోయిన టైటిల్‌ను అనౌన్స్ చేస్తోన్న బాలయ్య

నటసింహా నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రెండో సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ టీమ్ అంతా మళ్లీ కలిసి పనిచేస్తోన్న చిత్రమిది. ఇది బాలయ్యకు 105వ చిత్రం. ఈ సినిమాలో బాలకృష్ణను చాలా కొత్తగా చూపించనున్నారు దర్శకుడు. ఈ మూవీలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా మారతారని సమాచారం. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ‘రూలర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల జెమిని టీవీ ఇదే టైటిల్‌ను ప్రకటించేసింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమిని టీవీ.. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకుండానే సోషల్ మీడియా ద్వారా ‘రూలర్’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేసేసింది. దీంతో జెమిని టీవీపై బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారనుకోండి. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ఈనెల 26న మధ్యాహ్నం 2.50 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హ్యాపీ మూవీస్ ట్వీట్ చేసింది. Also Read: ఈ ప్రకటన నందమూరి అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపినా.. తెలిసిపోయిన టైటిల్‌కు మళ్లీ అనౌన్స్‌మెంట్ ఏమిటో అర్థం కావడంలేదని కొంత మంది అభిప్రాయం. అసలు ఈ సినిమా టైటిల్ ‘రూలర్’నేనా లేకపోతే మరో టైటిల్ ఏమైనా ఫిక్స్ చేశారా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలన్నంటికీ శనివారం సమాధానం దొరుకుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలయ్య స్టైలిష్ లుక్‌ను విడుదల చేశారు. మరి ఈ ఫస్ట్‌లుక్‌లో ఏమి చూపించబోతున్నారో చూడాలి. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Kljta
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...