Friday, 4 October 2019

పూరి మెచ్చిన పలాస

టాలీవుడ్‌లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా రియలిస్టిక్‌ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే బాటలో తెరకెక్కిన మరో ఇంట్రస్టింగ్ మూవీ పలాస 1978. 1978 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కరుణ కుమార్‌ దర్శకుడు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో సుధామీడియా పతాకంపై ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. రక్షిత్‌, నక్షత్రలు జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `గ్యాంగ్‌స్టర్‌ కథలంటే నాకు చాలా ఇష్టం.. కానీ అందరూ తిడుతున్నారని ఆ జానర్‌ సినిమాలు చేయటం లేదు. పలాస ట్రైలర్‌ నాకు చాలా నచ్చింది. హీరో హీరోయిన్లు బాగున్నారు. ప్రతీ క్యారెక్టర్‌ చాలా కన్విన్సింగ్‌గా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా` అన్నారు. Also Read: చిత్ర దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. `మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా గురించి మీడియా సర్కిల్స్‌లో పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన `ఓ సొగసరి` పాటకు మంచి స్పందన వస్తోంది. మా సినిమా టీజర్‌ను పూరీ గారు లాంచ్ చేయడం మా అదృష్టం. పూరిగారికి పలాస 1978 టీమ్ తరపున ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం` అన్నారు. ఈ సినిమాలో రఘు కుంచె, తిరువీర్‌, జనార్థన్‌, లక్ష్మణ్‌, శృతి, జగదీష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/355v8op
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...