Friday, 4 October 2019

మామాంగం.. అందరూ తెలుసు కోవాల్సిన చరిత్ర: మమ్ముట్టి

బాహుబలి సక్సెస్‌తో అన్ని భాషల్లోనూ పీరియాడిక్‌, హిస్టారికల్ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. బాలీవుడ్‌ లో థగ్స్‌ఆఫ్‌ హిందూస్థాన్‌, తెలుగులో సైరా లాంటి సినిమాలో ఆ కోవలోవే. తాజాగా మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి కూడా ఆ తరహా కథాంశంతో తెరకెక్కిన సినిమాలో నటిస్తున్నారు. కేరళ చరిత్రలోని ఓ కథతో తెరకెక్కిన భారీ చిత్రం మామాంగం. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. కేరళ చరిత్రలోని జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర నేపథ్యంలో రూపొందిన ఈ చారిత్రకచిత్రంలో మెగాస్టార్‌ మమ్ముట్టీ గతంలో చూడని విభిన్న పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు గతంలో ఏ సినిమాలోనూ చూపించని విధంగా ఈ సినిమాలో కలరి యుద్ధ విద్యకు సంబంధించిన విశేషాలను చూపిస్తున్నారు. ఈ సినిమాకు ఎం పద్మకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. Also Read: మమ్ముట్టి కెరీర్‌లో భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. `భారతదేశ చరిత్రలో ఎన్నో అద్భుతమైన గాథలు ఉన్నాయి. అయితే ప్రాంతీయ భాషల కారణంగా అవి అందరికీ తెలియకుండా పోతున్నాయి. అందుకే సినిమా అనే మాధ్యమం ద్వారా కేరళ చరిత్రను అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మామాంగం అందరూ చూడాల్సిన సినిమా` అన్నారు. చిత్ర దర్శకుడు ఎం. పద్మకుమార్ మాట్లాడుతూ.. `1695వ సంవత్సరంలో జరిగిన ఓ యాదార్థ కథతో, భారీ విజువల్స్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. జమోరిన్‌ని చంపిన చావేర్స్ కథే ఈ మూవీ. మమ్ముట్టితో పాటు మరో 12 ఏళ్ల కుర్రాడు అద్భుతంగా నటించాడు` అని తెలిపారు. నవంబర్‌ 21న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ZZ2J0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...