Saturday, 5 October 2019

‘వార్’ రికార్డ్ కలెక్షన్స్: అక్కడ ఫుల్.. ఇక్కడ నిల్!

బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘వార్’. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అంటూ ముందు నుంచీ ప్రచారం చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదలైంది. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ కూడా పాన్ ఇండియా మూవీగా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే, హిందీలో ‘వార్’ మూవీ తొలిరోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు రూ.51.60 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు రూ. 22.50 కోట్లు, మూడో రోజు రూ.21.30 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ‘వార్’ హిందీలో రూ.96 కోట్ల నెట్ వసూలు చేసింది. హిందీలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘వార్’.. తెలుగు, తమిళంలో మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయింది. మూడు రోజుల్లో తెలుగు, తమిళ వర్షన్లు కేవలం రూ. 4.15 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగాయి. మొత్తం మీద మూడు రోజుల్లో రూ.100 కోట్ల మార్కును అయితే ‘వార్’ దాటగలిగింది. మరోవైపు, ‘సైరా’ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోన్న ‘సైరా’.. హిందీలో మాత్రం అస్సలు రాణించలేకపోతోంది. అక్కడ డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. విమర్శకులు సైతం ‘సైరా’ పెద్దగా ఏమీలేదంటూ తేల్చయడంతో టిక్కెట్ విండో ఖాళీగా కనిపిస్తోంది. మూడు రోజుల్లో ‘సైరా’ హిందీ వర్షన్ కేవలం రూ. 6.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూడు రోజుల్లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35alIIk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...