Thursday, 3 October 2019

కొత్తింటికి Allu Arjun భూమి పూజ.. ఇంటి పేరేంటో తెలుసా?

స్టైలిష్ స్టార్ తన కొత్తింటి కలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడున్న ఇల్లు కాకుండా మరో ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భూమి పూజ చేయించుకున్నారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హాలతో కలిసి భూమి పూజ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కొత్త ఇంటికి బ్లెసింగ్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం అర్జున్ జూబ్లీహిల్స్‌లో ఇంట్లో తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆయన ఉంటున్న ఇంటి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు కేవలం తన కుటుంబంతో కలిసి ఉండేందుకు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారట. అల్లు అర్జున్‌కి తన తండ్రి అల్లు అరవింద్‌కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఎప్పటినుంచో వార్తలు వస్తు్న్నాయి. వాటిపై అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ రూమర్స్ విని నవ్వుకున్నానని అన్నారు. అయితే ఇప్పుడు అర్జున్ మరో ఇంట్లోకి మారాలనుకునే ఆలోచనలో ఉన్నారంటే దీని వెనకున్న రహస్యమేంటో ఆయనకే తెలియాలి. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో అర్జున్ ఉంటున్న ఇంట్లో ఆయనతో పాటు సోదరుడు అల్లు బాబీ, తమ్ముడు శిరీష్ కూడా ఉంటున్నారట. అదీకాకుండా ఇటీవల అల్లు బాబీకి పెళ్లైంది. దాంతో తమకంటూ ప్రైవసీ లేకుండా పోతోందని మరో ఇంటిని నిర్మించుకోవాలని అర్జున్ అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంట్లో జనాలు ఎక్కువ అవుతుండడంతో స్పేస్ సరిపోవడంలేదన్న కారణంతోనే అర్జున్ మరో ఇంటికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నారని, అంతకుమించి అర్జున్ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని కూడా అంటున్నారు. అర్జున్ తనకంటూ ఏది కొనుక్కున్నా తప్పకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఆయన ఓ లగ్జరీ కారవ్యాన్‌ను డిజైన్ చేయించుకున్నారు. దానికి ఫాల్కన్ అని పేరుపెట్టారు. దీని విలువ దాదాపు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. కారవ్యాన్ కొనుక్కున్నానని అభిమానులకు చెబుతూ ఫొటోలను కూడా పంచుకున్నారు అర్జున్. తనకంటూ సొంతంగా ఉన్నది ఏదీ లేదని, అవన్నీ అభిమానుల ప్రేమతో లభించినవని తెలిపారు. మరి ఇప్పుడు తన ఇంటిని ఎలా డిజైన్ చేయించుకోబోతున్నారో వేచి చూడాలి. ప్రస్తుతం అర్జున్.. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సినిమాలోని తొలి పాట అయిన ‘సామజవరగమన’ విడుదల చేశారు. పాటకు విపరీతమైన స్పందన వచ్చింది. తమన్ ఈ పాటను కాపీ కొట్టాడని పలువురు ఆరోపిస్తున్నారు. సంక్రాంతికి బన్నీ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n8Zg1f
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...