సినిమా నుండి ఎవరయినా ఏం ఆశిస్తారు, అదిరిపోయే కామెడీ టైమింగ్, మెరుపువేగంతో బన్నీ వేసే స్టెప్స్, దుమ్ము లేచిపోయేలా ఫైట్స్ .. ఇవే కదా. బన్నీ గత సినిమాలో పైన చెప్పుకున్న ఎలిమెంట్స్ చాలా వరకు మిస్ అయిపోవడంతో ఆ సినిమా కూడా మినిమమ్ యావరేజ్ మార్క్ కూడా అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమాలో మాత్రం తన నుండి ప్రేక్షకులు అందించే అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు బన్నీ. అందుకే ఆ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అసలే అజ్ఞాతవాసి నిరాశపరిచింది, అరవింద సమేత పర్లేదు అనిపించింది. ఈసారి మాత్రం త్రివిక్రమ్ తన పెన్ పవర్ ఫుల్‌గా చూపించాల్సి ఉంది. అయితే ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ మెటీరియల్ చూస్తుంటే ఈ సినిమాలో ఈ హ్యుజ్ కాంబో నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి అని ప్రూవ్ చెయ్యాలి అనే తపనతో ఉన్నట్టు కనిపిస్తుంది. ముందు బన్నీ తనపై తాను సెటైర్ వేసుకునే పంచ్‌తో ఈ సినిమాలో కామెడీ ఉంది అని కన్వే చేసారు. ఆ తరువాత సామజవరగమన అనే మెలోడీతో మ్యూజికల్ ఫీస్ట్ మిస్ అవ్వదు అని హింట్ ఇచ్చారు.ఇప్పుడు దసరా సందర్భంగా ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో మాత్రం బన్నీ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. నీట్‌గా టక్ చేసుకుని మరీ ఫైట్ ఫినిష్ చేసినట్టు కనిపిస్తుంది. చేతిలో పొడవాటి క్లాత్ ఒకటి పట్టుకుని మరీ రౌడీలను రఫ్ఫాడించేసాడు అని అర్ధమవుతుంది.అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కోసం ఒక గ్లాసెస్ స్కీమ్ ఫైట్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాలో కూడా ఫైట్‌కి తన మార్క్ చమక్ ఎదో యాడ్ చేసినట్టు ఉంది పోస్టర్ చూస్తుంటే. పోస్టర్‌లో బన్నీ పేస్‌లో అగ్రెసివ్ నెస్‌కి థియేటర్స్‌లో విజిల్స్ మోత ఎలా ఉంటుందో ఈ పోస్టర్ తోనే కన్వే చేసే ప్రయత్నం చేసారు. మొత్తానికి దసరా సర్ప్రైజ్ అంటే ఏం ఇస్తారు అనుకున్న ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే గిఫ్ట్‌తో సెలబ్రేషన్ మూడ్ సెట్ చేసింది సినిమా టీమ్. ఇప్పుడు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ అందరికి ఈ కొత్త పోస్టర్ ప్రౌడ్‌గా వాళ్ళ స్టేటస్‌లో పెట్టుకునేలానే ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vjhhqc
v
No comments:
Post a Comment