Monday, 23 September 2019

Urvashi Rautela: బోనీ కపూర్ నా నడుం పట్టుకున్నారని ప్రచారం చేశారు ఛీ ఛీ!

కొన్ని నెలల క్రితం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటి ఊర్వశి రౌతెలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్‌గా మారింది. ఓ పెళ్లి వేడుకలో తీసిన వీడియో అది. ఆ సమయంలో బోనీ కపూర్ ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తుండగా.. ఊర్వశి కూడా వచ్చారు. అప్పుడు బోనీ.. పక్కకు జరగండి అంటూ ఫ్రెండ్లీగా భుజంపై చెయ్యి వేశారు. అయితే అప్పటికే మీడియా ఫొటోగ్రాఫర్లు గ్యాప్ ఇవ్వకుండా టక టకా ఫొటోలు తీశారు. దాంతో ఆ ఫొటోల్లో బోనీ.. ఊర్వశి నడుం పట్టుకున్నట్లుగా వచ్చింది. దాంతో ఓ ఆంగ్ల మీడియా ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఊర్వశితో అసభ్యంగా ప్రవర్తించిన బోనీ కపూర్. పబ్లిక్‌గా ఆమె నడుం పట్టుకున్నారు’ అని ప్రచారం చేసేశారు. దాంతో ఊర్వశి ఆ ఆంగ్ల మీడియాకు ట్విటర్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. మ్యాటర్ సీరియస్ అవ్వకముందే అసలు విషయాన్ని అభిమానులకు వివరించడంతో పరిస్థితి సర్దుమణిగింది. దీని గురించి తాజాగా ఊర్వశి మరోసారి స్పందించారు. ‘ఆ విషయం తప్పుగా ప్రచారమైపోయింది. ఆ వీడియో ఓవర్‌నైట్ వైరల్ అయిపోయింది. కానీ బోనీ కపూర్ నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు. బోనీ నిర్మించిన ‘నేర్కొండ పార్వాయ్’ సినిమాలో నేను నటించాల్సింది ఉంది. కానీ డేట్లు కుదరక నేను సినిమాకు సంతకం చేయలేకపోయాను. అయినా కూడా బోనీ సర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నేను బోనీ సర్ ఓ పెళ్లికి వెళ్లాం. అయితే ఆయన నాకంటే ముందే పెళ్లికి వచ్చి ఫొటోలకు పోజులిస్తున్నారు. ఆయనతో పాటు నేను కూడా జాయిన్ అయ్యా. ఆ సమయంలో ఆయన నా భుజంపై చెయ్యి వేసి పక్కకు జరగండి అన్నారు. అందులో తప్పేముంది? దాంతో మీడియా వర్గాలు బోనీ నా నడుం పట్టుకున్నారని, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని రాసేశారు. ఛీ ఛీ.. ఆ తప్పుడు వార్తలు చూసి నాకు అసహ్యమేసింది. బహుశా కెమెరా ఆంగిల్ తప్పిదం వల్ల ఆయన నా నడుం పట్టుకుంటున్నట్లుగా ఫొటో క్లిక్ అయినట్లుంది. ఆ వీడియో వైరల్ అవడంతో దాదాపు వారం రోజుల పాటు నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి’ అని వెల్లడించారు ఊర్వశి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2kPA7Yo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...