Monday, 2 September 2019

Pawan Kalyan: పావలా కళ్యాణ్ అంటూ పవన్ హీరోయిన్ ట్వీట్.. చివరికి క్షమాపణ

ఆమె తెలియక చేసిన చిన్న పొరపాటు పవన్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించింది. పవన్ కళ్యాణ్‌కి పావలా కళ్యాణ్‌కి తేడా తెలియడం లేదా? అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హీరోయిన్‌కి చుక్కలు చూపించారు. చివరికి ఆ హీరోయిన్ దిగిరాక తప్పలేదు. ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఈ వివరాళ్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 2, పవర్ స్టార్ బర్త్ డే కావడంతో అభిమానులు పండగలా చేసుకున్నారు. పండగలా ఏంటి? నిజంగానే పండుగ. ఎందుకంటే నేడు వినాయక చవితి కావడంతో పవన్‌ని దేవుడుగా భావించే జనసైనికులు సంబరాల్లో మునిగితేలారు. మిలియన్ల కొద్దీ ట్వీట్స్‌తో విషెష్ మోత మోగించడంతో పవన్ ఇండియాలో టాప్ 1 ట్రెండింగ్ అయ్యారు. ఫ్యాన్స్ విషయాన్ని పక్కన పెడితే టాలీవుడ్ సెలబ్రిటీలు.. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఇండస్ట్రీ మొత్తం పవన్ నామస్మరణ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. అందరూ శుభాకాంక్షలు చెబితే.. ఆయనతో కలిసి పనిచేసిన హీరోయిన్స్ సైలెంట్‌గా ఉంటారా? అందుకే ‘కొమరం పులి’ చిత్రంలో పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ రొమాన్స్ చేసిన .. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెష్ చెప్తూ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేసిన నికీషా.. ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న ‘‘#HappyBirthdayPawalaKalyan, #HappyBirthdayPawanaKalyanfromSSMBfans, #HappyBirthdayPawalaKalyan #HappyBirthdayPSPK #pawankalyan’’ హ్యాష్ ట్యాగ్‌లను ఇచ్చింది. అయితే వీటిలో పవన్‌కి బదులుగా పావలా అని ఉన్న హ్యాష్ ట్యాగ్‌ను గుర్తించకపోవడంతో అదే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసేసింది నికీషా పటేల్. అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అందులోనూ ఈరోజు పవన్ బర్త్ డే కూడా.. ఇలాంటి హ్యాష్ ట్యాగ్ ఇస్తే ఊరుకుంటారా? పూనకంతో ఊగిపోతూ సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తూ చెడుగుడు ఆడేశారు. తప్పుగ్రహించిన నికీషా పటేల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి.. పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ‘ఎవరైనా హర్ట్ అయితే సారీ.. తప్పును సరిదిద్దుకున్నా. హ్యాపీ గణేషా.. #PSPK #pawankalyan అంటూ మరో ట్వీట్ చేసింది. ఈసారి సరిగానే ట్యాగ్ చేశా అనుకుంటున్నా.. సోషల్ మీడియా చాలా క్లిష్టంగా మారింది. దీన్ని ఎలా కొనసాగిస్తున్నారో నాకు తెలియదు’ అంటూ ఊపిరిపీల్చుకుంది నికీషా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PC40Ki
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...