Wednesday, 18 September 2019

Chiranjeevi Sye Raa: ‘సైరా’ ట్రైలర్.. మీకెందుకు కట్టాలిరా శిస్తు

మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసుకుంటూ అదిరిపోయే ట్రైలర్‌తో మెగాస్టార్ చిరంజీవి వచ్చేశారు. 2.54 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో నరసింహారెడ్డి పాత్రను మాత్రమే చూపించగా.. ట్రైలర్‌లో మిగిలిన ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. రాయలసీమ యోధుడు, స్వాతంత్య్ర సమరపోరాటానికి ఆద్యుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్‌ను మెగాస్టార్ చిరంజీవి పోషించారు. నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఇక అవుకు రాజుగా కిచ్చా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, వీరారెడ్డిగా జగపతిబాబు, లక్ష్మిగా తమన్నా నటించారు. భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఘనంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. పరుచూరి బ్రదర్స్ రచనా సహకారం అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LEhoJU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...