Wednesday, 18 September 2019

కరీనా కపూర్: అసలు నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావని అడిగారు

బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌కు డ్యాన్స్ రాదంటే ఎవరైనా నమ్ముతారా? డ్యాన్స్ రాకుండానే ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్‌లో కుర్రకారును ఉర్రూతలూగిస్తారా? కానీ ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్.. కరీనాకు డ్యాన్స్ రాదని తేల్చేశారు. ఇది ఇప్పటి సంగతి కాదులెండి. కరీనా కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలు. కరీనా ప్రస్తుతం ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’కు జడ్జి‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఇటీవల సరోజ్ ఖాన్ వచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా కరీనా.. సరోజ్‌తో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో సరోజ్ తనను ఎలా తిట్టేవారో గుర్తుచేసుకున్నారు కరీనా. ‘సరోజ్ ఖాన్‌ను ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. నా తొలి సినిమా ‘రెఫ్యూజీ’ సమయంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే సరోజ్ నన్ను తిట్టారు. ‘అసలు నీకు కాళ్లు చేతులు కదపడం వచ్చా. అసలు నువ్వు హీరోయిన్ ఎలా అవుదామనుకున్నావ్? నువ్వు కరిష్మా కపూర్ చెల్లివి’ అన్నారు. దాంతో నాకు భయమేసి నాకు డ్యాన్స్ రాదని చెప్పేశాను. దాంతో కనీసం ముఖంలో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వమని చెప్పారు. నేను బాత్రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని మరీ డ్యాన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చేసేదాన్ని. హీరోయిన్ అవ్వాలంటే సరోజ్ కంపోజ్ చేసిన డ్యాన్స్‌లను చూసి నేర్చుకోవాల్సిందేనని మా అమ్మ చెప్పింది. చెప్పాలంటే సరోజ్ అలా అరిచి మా చేత డ్యాన్స్ చేయించారు కాబట్టే ఈరోజు మేం హీరోయిన్లుగా ఎదిగాం’ అని వెల్లడించారు. డ్యాన్స్ అస్సలు రాదంటూనే కరీనా మూడు పదుల వయసులోనూ ఎన్నో ఐటెం సాంగ్స్‌లో ఆడిపాడారు. ఆమె సినిమాల కంటే పాటలే కుర్రకారును ఉర్రూతలూగించాయి. పైగా సినిమాల్లో నటించడం కంటే ఇలాంటి ఐటెం సాంగ్సే బాగుంటాయని భర్త సైఫే కరీనాకు సపోర్ట్ చేశారట. అటు సినిమా అవకాశాలకు కూడా ఆమెకు కొడవలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘అంగ్రేజీ మీడియం’, ‘గుడ్ న్యూస్’ సినిమాలు ఉన్నాయి. దీంతో పాటు ఆమె షో జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు. 21న కరీనా తన 38వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన పటౌడీ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జరపనున్నారు. ఇందుకోసం బుధవారం కరీనా, సైఫ్ కుమారుడు తైమూర్‌తో కలిసి పటౌడీ ప్యాలెస్‌కు బయలుదేరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30bXte0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...