Monday, 2 September 2019

అమ్మాయిలు అందంగా ఉండకూడదు.. ఇట్స్ ఎ క్రైమ్ అంటోన్న నాని

‘‘రైటర్‌ని అయ్యుండి నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. అసలు అమ్మాయిలు ఇంతందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్’’.. ఈ మాటలన్నది ఎవరో కాదు, నేచురల్ స్టార్ . ఇంతకీ ఆయన ఈ మాటలు ఎందుకన్నారు.. ఎవరిని చూసి అన్నారు. కంగారుపడకండి.. ఆయన ఈ మాటలు అన్నది ప్రియాంక అరుల్ మోహన్‌ను చూసి. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. టైటిల్ పాతదే అయినా కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు ఈ సినిమాలో నాని లీడర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు మూడో పాటను విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ‘నిన్ను చూసే ఆనందంలో..’ అంటూ సాగే మెలోడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. అనిరుధ్ కూడా స్వరం కలిపారు. అనంత్ శ్రీరాం సాహిత్యం అందించారు. Also Read: ఈ పాట ప్రారంభంలో చీరకట్టులో ఉన్న హీరోయిన్‌ను నాని రొమాంటిక్‌గా చూస్తారు. ‘ఎలా ఉన్నాను’ తను అడిగితే.. ‘‘అమ్మాయిలు ఇంతందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్’’ అని తనదైన స్టైల్లో అన్నారు. ఆ తరవాత పాట మొదలైంది. పాట చాలా బాగుంది. కాగా, ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘RX 100’ ఫేమ్ కార్తికేయ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి(సీవీఎం) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Um1Flr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...