Thursday, 5 September 2019

మహేష్ బాబుతో రాజమౌళి ‘మహాభారతం’!!

ఆలోచించగలిగే సత్తా ఉంటే, ఆ ఆలోచనలను వాస్తవంలోకి తీసుకురాగల సృజనాత్మకత సొంతం అయితే, దానికి రాజీలేని కష్టం తోడయితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుంది అనేది వేల కోట్ల రూపాయల వసూళ్ల సాక్షిగా నిరూపించింది జక్కన చేతిలో రూపుదిద్దుకున్న ‘బాహుబలి’. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పుడు టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్‌హీరోలను తీసుకుని రూ. 450 కోట్ల మాసివ్ బడ్జెట్‌తో ‘RRR’ సినిమాని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇదిలా ఉంటే, రాజమౌళి నెక్స్ట్ సినిమా అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం రాజమౌళి నెక్స్ట్ సినిమా ‘మహాభారతం’. ఆ సినిమాలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్నారు. మహేష్‌‌కి ఈ సినిమా బాలీవుడ్ డెబ్యూ కానుంది. అయితే, ఆ సినిమాలో ఆల్‌ఇండియా మెగాస్టార్ అమితాబ్‌తో పాటు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న రానా కూడా నటించనున్నారు అని అంటున్నారు. నిజానికి ‘మహాభారతం’ రాజమౌళికి డ్రీం ప్రాజెక్ట్. అయితే బాలీవుడ్ బడా హీరో ఆమిర్‌ ఖాన్ కూడా ‘మహాభారతం’ను వెబ్‌ సిరీస్‌గా భారీగా రూపొందించాలని అనుకోవడంతో ఈ ఆలోచనని పక్కనబెట్టేసారు జక్కన్న. కానీ, ఇప్పుడు ఆమిర్‌ ఖాన్ కూడా ‘మహాభారతం’ అనే ఆలోచన విరమించుకోవడంతో మళ్ళీ జక్కన్న ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే, ఈ చిత్రం ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని బడ్జెత్‌తో తెరకెక్కబోతోందని టాక్. Also Read: ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్ అంత ఈజీగా ఉండదట. రాజమౌళి ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే కేవలం సినిమా అనుకుని అందుబాటులో ఉన్న వాళ్ళతో తీసెయ్యడం అనేలా ఉండదు. మార్కెటింగ్ వరకు కూడా ఆలోచిస్తారాయన. అదంతా పూర్తవ్వడానికి చాలా టైం పడుతుంది. అయితే ‘RRR’ ప్రెస్‌మీట్‌లో మహేష్‌బాబుని అల్లూరి సీతారామరాజుగా కంటే జేమ్స్‌బాండ్‌గా చూడడం ఎక్సయిటింగ్‌గా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చేసారు జక్కన్న. ఇదిలా ఉంటే, గతంలో మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కౌ‌బాయ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మహేష్‌తో రాజమౌళి చేయబోతున్నారని అన్నారు. అది కేవలం బాలీవుడ్‌ని మాత్రమే కాకుండా హాలీవుడ్‌ని టార్గెట్ చేసి తియ్యబోతున్నారు అని టాక్ నడించింది. కానీ, ఇప్పుడు ఆ టాక్ పూర్తిగా మారిపోయింది. జక్కన్న విత్ అనేది ఫిక్స్ కానీ.. కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియాల్సి ఉందని ప్రచారం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zQMwPs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...