Thursday, 26 September 2019

రియాల్టీ షోలో కరీనా, ప్రియాంక చోప్రా ముద్దులు

బాలీవుడ్ స్టార్ నటీమణులు ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌లు ఇండస్ట్రీలోనే బద్ధ శత్రువులని టాక్. ఇందుకు కారణం బాలీవుడ్ షాహిద్ కపూర్. కరీనా, షాహిద్ ఒకప్పుడు డేటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పుడు షాహిద్‌కి పరిచయమైంది. వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. వీరి ప్రేమ కూడా ఫలించలేదు. దాంతో ప్రియాంక, కరీనాలు ఒకర్నొకరు దూషించుకున్నారని ఒకప్పుడు బాలీవుడ్‌లో చాలా వార్తలు వినిపించాయి. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య మ్యాటర్ మామూలైపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కి వెళ్లి భారతీయులను గర్వపడేలా చేస్తున్నారని కరీనా ఎంతో మురిసిపోయారు. ఈ విషయం పక్కనబెడితే.. వీరిద్దరి మధ్య స్నేహం ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకునే స్థాయిలో ఉందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కరీనా కపూర్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే రియాల్టీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రిటీలు ఇలాంటి షోలను ఉపయోగించుకుంటారన్న విషయం తెలిసిందే. అలా ప్రియాంక చోప్రా కూడా తాను నటించిన ‘స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ డ్యాన్స్ రియాల్టీ షోకు వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. కరీనా పక్కనే కూర్చుని ప్రియాంక కూడా కాస్త షోలో ఎంటర్‌టైన్ చేశారు. ఆ సమయంలో ప్రియాంక, కరీనా ఒకర్నొకరు పలకరించుకుంటూ ముద్దులిచ్చుకున్నారు. ముద్దులు అంటే మరీ పెదవి పెదవి చుంబిస్తూ కాదులెండి. సాధారణంగా పలకరించుకునేటప్పుడు దూరం నుంచి ముద్దులు ఇచ్చుకుంటారు కదా.. అలాగన్నమాట. ఆ సమయంలో తీసిన వీడియోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఓసారి కరీనా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రియాంక చోప్రాపై కామెంట్ చేస్తూ.. ‘ప్రియాంక చోప్రా ఓ రకమైన యాసలో మాట్లాడుతుంది. ఆమెకు అదెలా అలవాటైందో’ అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రియాంక ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. తనపై కరీనా చేసిన కామెంట్‌కు స్పందిస్తూ.. ‘కరీనా బాయ్‌ఫ్రెండ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో నేనూ అక్కడి నుంచే నేర్చుకున్నాను’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. దాంతో కరీనాకు కూడా కోపం వచ్చింది. ఏదైతేనేం ఇప్పుడు ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారయ్యారు. కెరీర్ పరంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఇప్పుడైనా ఈ క్యాట్ ఫైట్స్ ఆపకపోతే అసహ్యంగా ఉంటుంది. అందుకే ఇద్దరూ చక్కగా స్నేహితులైపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lXlHFR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...