Thursday, 19 September 2019

Ayushmann Khurrana: నిన్న అమ్మాయి.. నేడు గే..!

ప్రయోగాలు చేయడంలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాది అందెవేసిన చెయ్యి. ఏ సినిమా చేస్తే సమాజంలో ఎలాంటి ముద్రపడుతుందో అని భయపడే నటీనటులు ఉంటారు. కానీ ఆయుష్మాన్ అలా కాదు. కాస్త విభిన్నంగా ప్రయత్నిస్తూ ప్రేక్షకుడిని బుట్టలో వేసేసుకుంటారు. హీరోను చీరకట్టులో అమ్మాయి పాత్రలో చూడాలని ఏ ప్రేక్షకుడూ కోరుకోడు. అల చేస్తే హీరోయిజం ఏముంటుంది అనుకుంటారు. కానీ ‘డ్రీమ్ గర్ల్’ సినిమాతో హీరోలు కూడా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చని నిరూపించారు ఆయుష్మాన్. ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆయన మరో గెటప్‌లో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఆయుష్మాన్ ప్రధాన పాత్రలో ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆయుష్మాన్ గే పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం వీడియోను రూపొందించింది. 2017లో వచ్చిన ‘శుభ్ మంగళ్ సావధాన్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. సినిమాకు హితేశ్ కేవల్య దర్శకత్వం వహించనున్నారు. జితేంద్ర కుమార్, గజరాజ్ రావ్, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించనున్నారు. జాతీయ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ లాంటి హీరో గే పాత్రలో నటించడమనేది సాహసమనే చెప్పాలి. అయితే అభిమానులు ఆయన్ను ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటిస్తేనే ఆదరిస్తున్నారు. ఆయుష్మాన్ కెరీర్ ‘విక్కీ డోనర్’ సినిమాతో మొదలైంది. ఇందులో ఆయన వీర్యాన్ని అమ్ముకునే వ్యక్తి పాత్రలో నటించారు. సినిమా కెరీర్‌నే ఇలాంటి కాన్సెప్ట్‌తో మొదలుపెట్టిన ఆయుష్మాన్‌ను కమర్షియల్ సినిమాలో మాచో హీరోగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలీదు. దాంతో ఓ మాస్ హీరో చేయలేని కాన్సెప్ట్‌లనే తన సినిమాలుగా ఎంచుకుంటూ వస్తున్నారు ఆయుష్మాన్. అందుకే ఆయన సక్సెస్‌ఫుల్ హీరో అయ్యారు. ‘అంధాధున్’ సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ చేతిలో బాలా, గులాబో సితాబో సినిమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఆయుష్మాన్ సినిమాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాశిలో షూటింగ్ జరుపుకొన్నవన్నీ మంచి విజయాలు అందుకున్నవే. ఇప్పుడు ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమా షూటింగ్‌ కూడా వారణాశిలో జరుగుతోంది. 2020 మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34TYy91
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...