Thursday, 8 August 2019

‘V’లన్ నాని సిక్స్ ప్యాక్‌.. ఇంట్రస్టింగ్!

ప్రస్తుతం యూత్‌లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ.. సినిమా హీరోలతో పాటు సీరియల్ నటులు కూడా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్ హీరోలు.. ఒక్క మహేష్ మినహా.. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, రీసెంట్‌గా రామ్‌లతో పాటు.. యంగ్ హీరోలు కార్తికేయ, సుధీర్ బాబు, మంచు విష్ణు, నవదీప్‌లు సైతం సిక్స్ ప్యాక్స్‌తో సల్మాన్ ఖాన్ మాదిరి షర్ట్ విప్పి రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ చాలా సాప్ట్ లుక్‌లో మన పక్కింటి అబ్బాయిలా కనిపించే నేచురల్ స్టార్ షర్ట్ విప్పబోతున్నారు. అదేనండి ఈయన కూడా సిక్స్ ప్యాక్‌తో దర్శనం ఇవ్వబోతున్నారట. ‘జెర్సీ’ చిత్రంతో క్లాసిక్ హిట్ అందుకున్న నాని.. ‘గ్యాంగ్ లీడర్’ విడుదలకు రెడీగా ఉంది. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేసే నాని.. తన 25 సినిమాను లక్కీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనక్రిష్ణతో చేస్తున్నారు. సుధీర్ బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్‌లో ఈ చిత్రంలో నటిస్తున్నారు. అష్టాచెమ్మా చిత్రంతో నానిని నేచురల్ స్టార్‌గా మలిచిన ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో నానిని ఓ డిఫరెంట్ గెటప్‌లో చూపించబోతున్నారట ఇంద్రగంటి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ‘V’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగా ఈ చిత్రంలో నాని విలన్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. విలన్ గెటప్‌కి తగ్గట్టుగా నాని ఈ సినిమాకోసం సిక్స్ ప్యాక్ చేస్తున్నారట. ఈ సిక్స్ ప్యాక్ విలన్.. మరో సిక్స్ ప్యాక్ హీరో సుధీర్ బాబుని ఢీ కొట్టబోతున్నట్టు సమాచారం. అయితే ‘V’ నాని విలన్‌గా కనిపించేది కొంత సేపు మాత్రమే అని.. ఇందులో ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అందిస్తున్న సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YPeC7W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...