ఒకవైపు వైసీపీ అధినేతపై ఉన్న అమితమైన అభిమానం.. మరోవైపు తమన్నా తనకు వెన్నుపోటు పొడిచిందనే కోపం.. రెండింటికీ మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఉన్న ఆక్రోశం.. మూడింటినీ మిక్స్ చేసి తనదైన శైలిలో ఘాటైన పోస్ట్‌లు వదిలింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 నుండి ట్రాన్స్ జెండర్ తమన్నా గత రాత్రి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్‌లో వింత ప్రవర్తనతో తలదించుకుని బిగ్ బాస్ ఇంటి సభ్యులతోనే కాకుండా ప్రేక్షకులతో సైతం ఛీ అనిపించుకుంది తమన్నా. ఆమె మాట్లాడే తీరు, డ్రెస్, నోటి దురుసుతో వివాదాస్పద కంటెస్టెంట్‌గా మారి వెళ్లిన వారానికే బిగ్ బాస్ హౌస్ నుండి సూట్ కేస్ సర్దేసింది. ఇక ఈమె ఎలిమినేషన్‌పై ఇన్ డైరెక్ట్‌గా సెటైర్లు వేసింది శ్రీరెడ్డి. ‘ట్రాన్స్‌జెండర్ సోనా లేదా చంద్రముఖి వెళ్లుంటే ట్రాన్స్‌జెండర్స్‌పై రెస్పెక్ట్ తీసుకొచ్చేవారు. ఛా!! షో నాశనం అయ్యింది’ అంటూ తమన్నాపై పంచ్ పేల్చింది శ్రీరెడ్డి. ఇక జనసేన అధినేతన పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మరో పోస్ట్ వదిలింది. ‘రేయ్ ఎవడ్రా అది.. భీమవరంలో ప్రెస్ మీట్ పెట్టి గారి మీద సుడికుక్క మొరుగుడు మొరిగే ఎదవ.. చల్.. దె****’ అంటూ బూతులు మొదలెట్టింది శ్రీరెడ్డి. తాజాగా పవన్ కళ్యాణ్ వెస్ట్ గోదావరిలో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా భీమవరంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2N1N2Cd
v
No comments:
Post a Comment