Monday, 12 August 2019

AA19: ఆగస్టు 15న బన్నీ ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్!

భాతర స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న సినిమా టైటిల్‌ను ఆగస్టు 15న ప్రకటించబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది బన్నీకి 19వ చిత్రం కాగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాను ‘‘AA19’’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. మరో మూడు రోజుల్లో అసలు టైటిల్‌తో ప్రేక్షకులు పిలవబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం తండ్రీ, కొడుకుల కథ నేపథ్యంతో చాలా హిలేరియస్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు నివేతా పేతురాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల ప్రారంభంలో కాకినాడలో షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. కాకినాడ పోర్టులో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే మార్కెట్ ఏరియా, రంగరాయ మెడికల్ కాలేజ్, బీచ్ రోడ్‌లో కూడా చిత్రీకరణ జరిగింది. సుమారు 10 రోజులపాటు ఇక్కడ షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MTJilU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...