Saturday, 17 August 2019

Shakeela: ఏడుగురితో ఎఫైర్.. ఒకేసారి కాదు ఒకరి తరువాత ఒకరు తప్పా?: షకీలా

శృంగార తారగా సౌత్ ఇండియాను ఓ ఊపు ఊపిన .. తాజాగా సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్రంలో సంపూకి తల్లిగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో ఇకపై తెలుగులో ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తానంటున్నారు షకీలా. Read Also: ఇక తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ.. ఇప్పటికే తన వయసు 43 వచ్చేశాయని ఇకపై పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదన్నారు. ఇక తన లైఫ్‌లో ఏడుగురితో రిలేషన్‌లో ఉన్నానని వాళ్లు ఒక్కొక్కరుగా దూరం అయ్యారన్నారు షకీలా. అయితే మీతో ఏకంగా ఏడుగురు రిలేషన్‌లో ఉండి.. దూరం కావడానికి కారణం మీరే అయి ఉండొచ్చుగా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘నేను మొదటి వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నప్పుడే మా అమ్మ అడ్డు చెప్పి ఉంటే ఈపాటికి పెళ్లై బిడ్డలు ఉండేవారు. కాని ఒక్కొక్కరుగా నా నుండి వెళిపోవడానికి నేను కూడా కారణం అయి ఉండొచ్చు. నేను ముసుగు వేసుకుని ఏ తప్పూ చేయలేదు. ఏది చేసినా పబ్లిక్‌కి తెలిసేలా చేశాను. నా ఇష్టం ప్రకారమే గ్లామర్ రోల్స్ చేశా. ఎవరితోనూ రాంగ్ ఎఫైర్ పెట్టుకోలేదు. ఒక ఎఫైర్ తరువాత ఇంకో ఎఫైర్ పెట్టుకున్నా.. ఒకరితో ఉంటూ ఇంకొరితే ఎఫైర్ కంటిన్యూ చేయలేదు. ఎక్కడా నా మీద తప్పులేదు.. అందుకే ఓపెన్‌గా ఉన్నా’ అంటూ క్లారిటీ ఇచ్చారు షకీలా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NaRm1T
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...