Tuesday, 27 August 2019

RRR: రాజమౌళి సర్‌ప్రైజ్ ఆ రోజేనా?

అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అదేంటంటే.. తారక్ పాత్రకు సంబంధించిన లుక్‌ను త్వరలో విడుదల చేయబోతున్నారట. అక్టోబర్ 22న ఈ సర్‌ప్రైజ్ ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. తారక్ పాత్ర కోసం కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పిటికే ఓ బ్రిటిష్ భామను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమా గురించి రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు రెట్టింపైపోయాయి. సినిమా 2020 జులై 30న విడుదల కానుంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. కనీసం పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి తారక్ లుక్‌పై వస్తున్న వదంతులపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lg0XSm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...