Tuesday, 27 August 2019

మోస్ట్ వాంటెడ్ బ్యూటీతో అఖిల్ రొమాన్స్!.. షాకింగ్ రెమ్యునరేషన్

అక్కినేని మూడోతరం వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్నూ.. ఇలా తొలి మూడు చిత్రాలతో తీవ్రంగా నిరాశ పరిచిన అఖిల్ ప్రస్తుతం నాలుగో చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న అఖిల్ వరుస పరాజయాలతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైన బొమ్మరిల్లు భాస్కర్‌‌తో జతకట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. Also Read: ఫ్లాపుల్లో ఉన్న హీరో, డైరెక్టర్ కలిసి తీస్తున్న ఈ సినిమాకు హైప్ రావాలంటే ఎవరైనా క్రేజీ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట. అందుకే తెలుగు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కన్నడమ్మాయి పూజా హెగ్దేని సంప్రదించారట. అయితే తనకున్న క్రేజ్‌ను బట్టి పూజా ఏకంగా రూ.3.5కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పూజా డిమాండ్‌కు నిర్మాతలు ఓకే చెప్పేయడంతో ఆమె త్వరలోనే యూనిట్‌తో కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. Also Read: మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్ పతాకంపై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆసక్తిరేపే టైటిల్‌ ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. . ‘100% లవ్’ తర్వాత అక్కినేని వారసుడు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించడం ఇదే తొలిసారి. పూజా హెగ్దేకి ఉన్న లక్కీ బ్యూటీ ట్యాగ్ అయినా అఖిల్‌కు హిట్ తెస్తుందో? లేదో? చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NBBO7p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...