Wednesday, 14 August 2019

Ravi Teja ఇండిపెండెన్స్ డే కానుక.. ‘డిస్కో రాజా’ ఇంట్రస్టింగ్ పోస్టర్!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డిస్కో రాజా’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇదివరకే సినిమా టైటిల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ చేయగా.. తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా అమరవీరుల గౌరవార్థం మరో పోస్టర్ రిలీజ్ వచ్చేసింది. ‘ప్రతి ఒక్క దేశభక్తుడు, అమరుల త్యాగాలను మనం స్మరించుకోవాలి. స్వాతంత్య్రం రావడానికి ఆ రియల్ హీరోల పోరాటాలే కారణం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అని విషెస్ తెలుపుతూనే డిస్కో రాజాతో తన ఇంట్రెస్టింగ్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే రవితేజ ముఖాన్ని రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న డిస్కో రాజాలో అందాల భామలు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓ కథానాయిక ‘నన్ను దోచుకుందువటే’ఫేమ్ నాభా నటేశ్‌ కాగా, మరో హీరోయిన్ ‘RX 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్. మరోవైపు ‘నేల టిక్కెట్’ఫ్లాప్ తర్వాత ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి, రవితేజ కాంభినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో కాస్త జాగ్రత్తలు తీసుకుని ప్రాజెక్టు మీద వర్క చేస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KLQsGq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...