Wednesday, 14 August 2019

‘రణరంగం’ ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. చిరంజీవి కటౌట్!

యంగ్ హీరో గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. ఫస్ట్‌లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వా.. ఆ తరవాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. దీనికి తోడు ప్రచారం కూడా బాగానే కల్పించారు. కాకినాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవల ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన రామ్ చరణ్ వహ్వా అన్నారు. మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూస్తున్నవాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఇంకా ఫస్ట్ ప్రీమియర్ షో పూర్తికాలేదు. అది పూర్తయితే కానీ సినిమాకు సంబంధించి పూర్తి టాక్ బయటికి రాదు. అయితే, సినిమా జరుగుతుండగానే ప్రేక్షకులు కొన్ని ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు. వీటిలో ఒకటి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గంభీరమైన స్వరంతో సినిమా ప్రారంభమైందట. ఈ విషయాన్ని కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఇప్పుడు అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అలాగే సినిమాలో ‘అల్లుడా మజాకా’ రిలీజ్ డే ఉందట. చిరంజీవి కటౌట్‌ను చూపించారని.. థియేటర్‌లో గోల గోల అని మరొక ప్రేక్షకుడు ట్వీట్ చేశారు. మొత్తానికి ‘రణరంగం’ సినిమా ఎలా ఉందో ఇంకా తెలియకపోయినా ఈ రెండు అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KAJyEY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...