Saturday, 10 August 2019

Prabhas Saaho: ‘సాహో’ ట్రైలర్.. క్యారెక్టర్స్ ఇంట్రస్టింగ్

యంగ్ రెబల్ స్టార్ నటించిన మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ ‘సాహో’ ట్రైలర్ ఈ రోజు (ఆగస్టు 10) సాయంత్రం 5 గంటలకు విడుదల కానుండటంతో ఈ భారీ యాక్షన్ ట్రీట్ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత లాంగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఈ చిత్రాన్ని చేస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ సుందరి శ్రద్ధా కపూర్ నటించింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌కు సంబంధించిన ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధాకపూర్ లుక్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఈ చిత్రంలోని ఇతర కీలకపాత్రల్ని రివీల్ చేశారు. వెన్నెల కిషోర్ ,మందిరా బేడీ ,ఇవాలియన్ శర్మ, మురళీశర్మ, జాకీ ష్రాఫ్, తిన్ను ఆనంద్, మంజ్రేకర్ మహేష్, లాల్ తదితరులు క్యారెక్టర్‌లు వారి లుక్స్‌ను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకు ‘సాహో’ ట్రైలర్‌లో సందడి చేయబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MTLR7u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...