Saturday, 10 August 2019

Manmadhudu 2 Day 1 Collections: ‘మన్మథుడు 2’ ఫస్ట్ డే కలెక్షన్స్.. డల్లా.. ఫుల్లా?

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించిన ‘మన్మథుడు 2’ మూవీ శుక్రవారం నాడు విడుదలై మిక్స్ టాక్‌తో రన్ అవుతోంది. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా ఈ ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘చి.ల.సౌ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నారు. ఇక నాగార్జున కెరియర్‌లోనే భారీగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 కోట్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 3.86 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. నైజాం ఏరియాలో రూ. 1.3 కోట్లను రాబట్టింది. అయితే ఓవర్సీస్‌ మన్మథుడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. యూఎస్ 150 పైగా లొకేషన్లలో విడుదలైంది ఈ చిత్రం. ప్రీమియర్స్ షోస్ ద్వారా $82,190 వసూళ్లతో నాగ్ కెరియర్‌లో బెస్ట్ సోలో గ్రాసర్‌గా నిలిచింది. దేవదాస్ చిత్రానికి $159,724 రాగా.. మనం చిత్రం $95,473 రాబట్టింది. ‘మన్మథుడు 2’ $82,190 మూడోస్థానంలో నిలిచింది. ఓవరాల్ ఆక్యుపెన్సీ ఇంప్రూవ్ అయితే వీకెండ్‌లో ‘మన్మథుడు 2’ చిత్రానికి కెలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ చిత్రానికి పాజిటవ్ టాక్ ఉండటంతో ఆ బీ,సీ సెంటర్లలో మన్మథుడుపై పడే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2McLXYk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...