అతిలోక సుందరి శ్రీదేవి మన నుంచి దూరమై ఏడాది దాటిపోయింది. శ్రీదేవి ఈ లోకంలో లేకపోయినా ఆమె జ్ఞాపకాలను మాత్రం ఇక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారు. శ్రీదేవి జ్ఞాపకాలను ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. నేడు శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా మరోసారి ఆమెను అంతా తలుచుకుంటున్నారు. మనకు కనిపించని లోకంలో ఉన్న అతిలోక సుందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక శ్రీదేవి కుమార్తె, నటి తన తల్లి కోసం ప్రత్యేక పూజలు చేయడానికి తిరుమల వచ్చారు. ఆమె తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్థించారు. శ్రీదేవి జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని జాన్వి కపూర్ దర్శించుకున్నారు. తన స్నేహితురాలితో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్న జాన్వి.. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తిరుమలలో తన స్నేహితురాలితో తీసుకున్న ఫొటోను జాన్వి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలుగింటి ఆడపడుచుకి కుమార్తె అయిన జాన్వి సంప్రదాయ లంగావోణీలో చాలా అందంగా కనిపించారు. బయట ఎప్పుడూ మోడరన్ దుస్తుల్లో కనిపించే జాన్వి ఈ సంప్రదాయ వస్త్రధారణలో కొత్తగా ఉన్నారు. ఇదిలా ఉంటే, తన తల్లి జయంతిని పురష్కరించుకుని జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్‌డే మమ్మా, ఐ లవ్ యు’’ అని శ్రీదేవి అందమైన ఫొటోను షేర్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YGzvXE
v
No comments:
Post a Comment