Sunday, 4 August 2019

నేనొస్తున్నాను.. నా కొడుకు, కోడలు ఫసక్: నాగార్జున

పెద్ద కుమారుడు నాగచైతన్య, కోడలు సమంతలకు అక్కినేని అదిరిపోయే సవాల్ విసిరారు. తాను రంగంలోకి దిగుతున్నానని ఇక వాళ్ల పని అయిపోయిందంటూ అందరినీ నవ్వించారు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున తనదైన శైలిలో మాట్లాడారు. అందరినీ నవ్వించారు. ‘‘ఆగస్టు నెల నాకు చాలా ఇష్టమైన నెల. మొన్ననే ‘బిగ్ బాస్’ ప్రారంభమైంది. 9వ తారీఖున ‘మన్మథుడు 2’ రిలీజ్ అవుతుంది. ఈ నెలాఖరికి నాకు 30 ఏళ్లు నిండుతాయి’’ అని నాగార్జున సరదాగా అన్నారు. ఈ సినిమాకు ‘మన్మథుడు’ అనే టైటిల్‌ను మళ్లీ వాడటానికి గల కారణాన్ని నాగార్జున వెల్లడించారు. ‘‘ఆ ఒరిజినల్ మన్మథుడుకి ఆడవాళ్లంటే పడదు. మరి ఆ సర్కిల్‌ని ఫినిష్ చేయాలి కదా! అందుకే ‘మన్మథుడు 2’కి ఆడవాళ్లంటే ఇష్టం. అందుకనే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం’’ అని నాగార్జున చెప్పారు. ఇదో ఫ్రెంచ్ సినిమా ‘మన్మథుడు 2’ను ఓ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా చేసినట్టు నాగార్జున వెల్లడించారు. ‘‘నేను ఒక లవ్‌స్టోరీ చేయడమేంటని చాలా మంది అడిగారు. సంవత్సరం క్రితం ఓ ఫ్రెంచ్ ఫిలింను నాకు చూపించారు. ఇది నా వయసు తగ్గ సినిమా. ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు.. ఏ వయసులోనైనా రొమాన్స్ చేయొచ్చు అని చెప్పే సినిమా. అందుకే ఈ సినిమా చేశాను’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు. తనకు ఇద్దరు పిల్లలున్నారని అంటున్నారని.. కానీ, తనకు ఉన్నది ఇద్దరు తమ్ముళ్లని నాగార్జున సరదాగా అన్నారు. బ్యాంకాక్‌లో ఉంటే ఫోన్ చేశా.. ఒరిజినల్ ‘మన్మథుడు’కి దర్శకత్వం వహించిన కె.విజయ్ భాస్కర్‌ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. అయితే, ఆయన్ని ఆహ్వానించిన విధానాన్ని నాగార్జున సరదాగా చెప్పారు. ‘‘ప్రీ రిలీజ్ వేడుకకు రమ్మని నేను విజయ్ భాస్కర్‌గారికి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన బ్యాంకాక్‌లో ఉన్నారు. వాళ్ల ఆవిడతో వెళ్లినట్టున్నారు. ఫోన్ చేసి సార్ మీరు మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావాలి అని అడిగాను. వస్తాను సార్.. ఇప్పుడే మా ఆవిడని గీజర్ ఆన్ చేయమన్నాను, కానీ మీ టీజర్ చూశాక గీజర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు అని ఒక పంచ్ వేశారు. చాలా వేడివేడిగా ఉంది మీ టీజర్ అన్నారు’’ అని నాగార్జున గుర్తుచేసుకున్నారు. మా పెద్దబ్బాయి, కోడలికి ఫసక్ ‘మన్మథుడు 2’ సినిమాతో కొడుకు కోడళ్లు నాగచైతన్య, సమంతకు షాక్ ఇవ్వబోతున్నానని నాగార్జున సరదాగా అన్నారు. ‘‘ఈ సమ్మర్‌కి మా పెద్దబ్బాయి ‘మజిలీ’ అనే సినిమాతో మీ ముందుకు వచ్చాడు. మొన్న ‘ఓ బేబీ’ అంటూ నా కోడలొచ్చింది. రేపు ఆగస్ట్ 9న ఆ రెండింటిని ఫసక్.. అవుట్. నేనొస్తున్నాను!’’ అని అందరినీ నవ్వించారు నాగార్జున. ‘మన్మథుడు 2’ కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అని.. ప్రారంభం నుంచి చివరి వరకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారని నాగార్జున హామీ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MEsAqO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...