Saturday, 3 August 2019

న‌ట‌ గురువు క‌న‌కాల‌కు మెగాస్టార్ చిరంజీవి కన్నీటి నివాళి

ద‌ర్శ‌క‌న‌టుడు.. న‌ట‌గురువు దేవ‌దాస్ క‌న‌కాల (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. నేటి (శ‌నివారం) ఉదయం కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు స‌మీపంలోని ఆయ‌న‌ స్వ‌గృహానికి పార్థీవ దేహాన్ని తీసుకొచ్చారు. అనంత‌రం హైద‌రాబాద్ మ‌హాప్ర‌స్థానంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు. తనయుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలను పూర్తి చేశారు. న‌ట‌గురువు క‌న‌కాల మృతి ప‌ట్ల మెగాస్టార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ పార్థీవ దేహాన్ని సంద‌ర్శించుకున్న అనంత‌రం క‌న‌కాల‌ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. నాటక రంగం నుండి సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన టాలీవుడ్ లో ఎంద‌రో న‌టీన‌టుల్ని తీర్చిదిద్దారు. చిరంజీవి, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రుల‌కు ఆయ‌న న‌ట‌న‌లో శిక్ష‌ణ‌నిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Kh2lDK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...