Saturday, 3 August 2019

ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు.. బెస్ట్ ఫ్రెండ్ షిప్ సాంగ్స్..

ఈ ప్రపంచంలో మనకు ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ స్నేహితులు ఎప్పుడూ ప్రత్యేకమే. ఎందుకంటే మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చిన దేవుడు.. అమ్మానాన్నలతో పాటు కుటుంబసభ్యులను ఆయనే అందిస్తాడు. కానీ స్నేహితులను మాత్రం మనమే ఎంపిక చేసుకుంటాం. మన బాగోగులు చెప్పడంతో పాటు మనల్ని చెడుదారిలోకి వెళ్లకుండా చూస్తాడు స్నేహితుడు. మన బాధని తన బాధకంటే ఎక్కువగా ఫీలయ్యే వారిలో ముందు వరుసలో నిలిచేది ఫ్రెండ్స్. కుటుంబం, బంధువులతో షేర్ చేసుకోలేని ఎన్నో విషయాలను మనం పంచుకునేది స్నేహితుల దగ్గరే. నేను అనాథను నాకు ఎవరూ లేరని చెప్పేవాళ్లు.. నాకు ఫ్రెండ్ లేడని మాత్రం చెప్పడు. అది ఫ్రెండ్ షిప్ విలువ. మంచి పుస్తకం ఓ మంచి స్నేహితుడితో సమానం అంటారు. అంటే.. మనకు విలువైన మాటలు చెబుతూ, సలహాలిస్తూ తనతో పాటు ముందుకుసాగేలా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ‘స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు’. స్నేహం విలువను తెలిసే కొన్ని మధురమైన పాటలు మీకోసం. మూవీ: ప్రేమ దేశం సాంగ్: ముస్తఫా ముస్తఫా.. మూవీ: హ్యాపీ డేస్ సాంగ్: ఓ మై ఫ్రెండ్.. మూవీ: ఉన్నది ఒకటే జిందగీ సాంగ్: ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు.. మూవీ: పెళ్లి పందిరి సాంగ్: దోస్త్ మేరా దోస్త్..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/335cAE5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...