Monday, 1 July 2019

Sye Raa: సైరా వివాదం.. ‘ఈ కక్కుర్తి దేనికి రామ్ చరణ్’?

బయోపిక్ చిత్రాలు తీయడం అంటే కత్తిమీద సామే అని ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం మరోసారి నిరూపితం చేస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్ మొదలు.. ఇప్పటి వరకూ ఈ సినిమాను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అందులోనూ ఈ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు నుండి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తాజాగా ఆదివారం నాడు.. ‘సైరా’ నిర్మాత కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. అప్పట్లో తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగా.. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి రామ్ చరణ్‌ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదోళ్ల ఉసురుపోసుకోవడం ఎందుకంటూ ఫైర్ అయ్యారు కత్తి మహేష్. ఈ సందర్భంగా ఫేస్ బుక్‌లో పోస్ట్ వదులుతూ దయచేసి మనిషిగా ఉండండి అంటూ హితవు పలికారు కత్తి మహేష్. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మోసం చేయడం. షూటింగ్ కోసం పొలాలు తీసుకుని, డబ్బు ఇవ్వకండా ఎగ్గొట్టడం. రూ. 250 కోట్ల సినిమాలో వీటి ఖర్చు ఎంత శాతం? ఒక రూ. 50 లక్షల ఖర్చు ఏపాటిది? ఒక హీరోయిన్‌కు ఇచ్చే వారం రెమ్యునరేషన్‌లో సగం. అయినా ఈ కక్కుర్తి దేనికి! పేదోళ్ల ఉసురుపోసుకోవడం ఎందుకు!? ఇలా చేస్తే సినిమా గౌరవం నిలుస్తుందా? చిరంజీవి ఖ్యాతి ఇనుమడిస్తుందా? రామ్ చరణ్.. దయచేసి మనిషిగా ఉండండి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు కత్తి మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XNGhd3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...