Monday, 1 July 2019

‘కౌసల్య కృష్ణమూర్తి’ ఆడియో ఫంక్షన్.. మిథాలీ రాజ్ చీఫ్ గెస్ట్

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. ‘ది క్రికెటర్’ అనేది ట్యాగ్‌లైన్. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం (జులై 2న) చిత్ర ఆడియో విడుదల వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భారత క్రికెట్ జట్టు క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు రాశీ ఖన్నా విచ్చేస్తున్నారు. పల్లెటూరులో పుట్టిన అమ్మాయి క్రికెటర్‌గా ఎలా ఎదిగిందో చూపించే చిత్రమే ‘కౌసల్య కృష్ణమూర్తి’. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. మహిళా క్రికెటర్‌గా కౌసల్య (ఐశ్వర్య రాజేష్‌) ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది క్రికెట్ నేపథ్యమున్న సినిమా కావడంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించారు. ఆమె కూడా రావడానికి అంగీకరించారు. మిథాలీ రాకతో ఈ సినిమాకు మంచి ప్రచారం లభించినట్టే. ఈ సినిమాలో క్రికెటర్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్.. నటుడు రాజేష్‌ కుమార్తె. హాస్యనటి శ్రీలక్ష్మి స్వయానా మేనకోడలు. ఇప్పటికే తమిళం, మలయాళంలో సినిమాలు చేసిన ఐశ్వర్య రాజేష్‌.. ఇప్పుడు ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. కాగా, ఈ సినిమాలో తమిళ నటుడు శివ కార్తికేయన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయ ఒక తెలుగు సినిమాలో ఇప్పుడు నేరుగా నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xg8ZDI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...