పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఆయన కంటే ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నాడు. తనదైన శైలిలో ఆ సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నాడు. హైదరాబాద్ రోడ్ల మీద ట్రిపుల్ రైడ్ చేసి పోలీసులెక్కడా? అంటూ సవాల్ విసిరి.. వాళ్లతో ఫైన్ వేయించుకొని పబ్లిసిటీ పొందిన వర్మ.. తన శిష్యుడు పూరీ జగన్నాథ్‌ను తిట్టడంతోపాటు, చార్మీకి ముద్దులు పెట్టి మరీ ‘ఇస్మార్ట్’ సంబరాలు చేసుకుంటున్నాడు. అరేయ్ జగన్‌గా ఇట్టాంటి బ్లాక్‌బస్టర్‌లు తీసే దమ్ముండి కూడా ఎందుకు తీయవురా బాడ్‌కావ్? అని పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి వర్మ ట్వీట్ చేశాడు. దీనికి ఇస్మార్ట్ హీరో రామ్, హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్‌లతోపాటు చార్మిని సైతం ట్యాగ్ చేశాడు. చదవండి: దీనికి పూరీ కంటే ముందు స్పందించిన చార్మి.. సార్ జగన్‌కు నేను చాలా సార్లు చెప్పాను. అతడి ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ కోరుకుంటున్నారు. జగన్ బలం ఎంటర్‌టైన్మెంట్.. ఇస్మార్ట్ శంకర్ దాన్ని నిరూపించింది. ఇప్పుడు మరింతగా తిట్టండి.. అతడు ఇలాగే హిట్లు కొడతాడని ఆర్జీవీ ట్వీట్‌కి చార్మి బదులిచ్చింది. ఇక వర్మ బూతు ప్రేమకు స్పందించిన పూరీ జగన్నాథ్.. సార్ మీ తిట్లకు నేను అర్హుడినే, లవ్యూ.. అని తను కూడా గురువు మీద ప్రేమను చాటుకున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YYvFVQ
v
No comments:
Post a Comment