Tuesday, 2 July 2019

Ram Gopal Varma: GST నగ్న సుందరికి వర్మ ఘాటు విషెష్.. నీ బాహ్య సౌందర్యంకంటే!

పోర్న్ స్టార్ నగ్న సౌందర్యంపై మరోసారి మనసువిప్పాడు సౌందర్య పిపాసదర్శకుడు . ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే లఘు చిత్రంతో మియా మాల్కోవాను పూర్తి నగ్నంగా చూపించి.. మియా మాల్కోవా శరీరంలోని ప్రతి అణువును తన కెమెరాతో అత్యద్భుతంగా బంధించి.. మియా నగ్నత్వాన్ని పవిత్రంగా చూపిస్తున్నానని సంచలనాలకు తెరతీసిన వర్మ.. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఘాటైన విషెష్ అందించారు. నిజానికి పుట్టినరోజులు, శుభాకాంక్షల కల్చర్‌కి దూరంగా ఉండే వర్మ.. మియా మాల్కోవా పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరీ విషెష్ అందించడం విశేషం అనే చెప్పాలి. మియా మాల్కోవా బాహ్య సౌందర్యాన్నే కాకుండా ఆమె లోపలి అందం ఇంకా అద్భుతం అంటూ అభివర్ణించాయన. ఆమె పర్సనాలిటీపై ప్రశంసలు కురిపిస్తూ.. నీ పర్సనాలిటీతో ఎంతో మందికి సంతోషాన్ని పంచుతున్నావు.. అందుకే నువ్ సంతోషంగా ఉండాలని ఈ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తున్నా అన్నారు వర్మ. ‘నీతో కలిసి పనిచేసిన నేను నిన్ను చూసి తెలుసుకున్నది ఏంటంటే.. బాహ్య సౌందర్యానికి అంతర సౌందర్యం జతకలిస్తే నీ లాంటి బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉంటుందని రియలైజ్ అయ్యాను. నీ అందానికే కాదు నీ సోల్‌కి కూడా ఫిదా అయ్యాను. ఇప్పటి వరకూ నీలాంటి నిజాయితీ, బలమైన, ఖచ్చితమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని ప్రపంచానికి ఆనందం పంచాలంటూ మియా మాల్కోవా అందాలను వర్ణిస్తూ పాలకోవ లాంటి ట్వీట్లు చేశారు రామ్ గోపాల్ వర్మ. అన్నట్టు ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ లఘు చిత్రానికి కొనసాగింపుగా పార్ట్ 2 తీస్తానని అప్పట్లో ప్రకటించిన వర్మ.. ఇప్పుడు మియా మాల్కోవా బర్త్ డే సందర్భంగా వరుస ట్వీట్లు చేయడంతో పార్ట్ 2కి ప్రమోషన్స్ మొదలు పెట్టేసినట్టే కనిపిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XsKSlz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...