Tuesday, 2 July 2019

Oh Baby: సమంత సెంటిమెంట్.. 3500 మెట్లెక్కి మొక్కుతీర్చుకున్న ‘ఓ బేబీ’

గోవింద.. గోవింద.. అంటూ కాలినడకన తిరుమల మెట్లెక్కి శ్రీవారి మొక్కు చెల్లించుకున్నారు అక్కినేని సమంత. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5న విడుదల కానుండటంతో స్నేహితురాలు, ప్రముఖ తమిళ నటి, వీజే రమ్య సుబ్రమణియన్‌తో కలిసి కాలినడకన 3,500 మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అనంతరం టీఎస్ఆర్ అతిథి భవనంలో విశ్రాంతి తీసుకుని మంగళవారం ఉదయం సుప్రభాతసేవలో శ్రీ వారిని దర్శించుకుని శ్రీవారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తాను నటించిన ‘ఓ బేబీ’ సినిమా విజయవంతమవ్వాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు సమంత. సమంతతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ.. కాలినడకన తిరుమలకు వెళ్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రమ్య సుబ్రమణియన్‌. ఈ సందర్భంగా సమంత నటించిన ‘ఓ బేబీ’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరారు రమ్య సుబ్రమణియన్‌. కాగా సమంత సామాన్య భక్తులతో కలిసి ఏడు కొండలు ఎక్కడం.. మధ్య, మధ్యలో భక్తుల పలకరింపులతో పాటూ వారితో సెల్ఫీలు దిగి సరదాగా గడిపారు. సమంత కాలినడకన తిరుమలకు చేరుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే సమంత కాలినడకన తిరుమల మెట్లు ఎక్కడం ఇదే తొలిసారి కాదు. పెళ్లి తరువాత నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం రిలీజ్‌‌కు ముందు తిరుమలకు కాలినడకన వెళ్ళి ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకున్నారు. అనంతరం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ‘ఓ బేబీ’ చిత్ర రిలీజ్‌కు ముందు సమంత తిరుమలకు కాలినడకన వెళ్లడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JnEkKL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...