Monday, 15 July 2019

‘సాహో’రే వార్.. యాక్షన్ సీన్లతో షేక్ చేస్తున్న హృతిక్ సినిమా, రెండు సింహాలు తలపడితే?

రెండు కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటది..? అచ్చం అలాగే ఉంది బాలీవుడ్ సెన్సేషన్ ‘వార్’. టీజర్‌తోనే సినీ ప్రపంచాన్ని షేక్ చేసింది. , టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సన్నివేశాలు హాలీవుడ్ మూవీలకు ఏమాత్రం తీసిపోనివిధంగా ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోల మధ్య వార్ సీక్వెన్సులే హైలైట్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. యాక్షన్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోమవారం (జులై 15) విడుదల చేసింది. 53 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ యాక్షన్ ఎపిసోడ్లతో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. ‘వార్’ సినిమాలో కథానాయిక వాణికపూర్.. ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. యాక్షన్ సీన్ల మధ్య అందాల ఆరబోతతో కనువిందు చేస్తున్నారు. టీజర్‌లో ఆపి ఆపి చూపిస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్.. ఊపిరిబిగపట్టేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ప్రకటించిన నాటి నుంచే ఈ మూవీపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ రిలీజయ్యాక అవి మరింత పెరిగాయి. ఓ రకంగా చెప్పాలంటే.. వార్ టీజర్ చూసి బాలీవుడ్ ప్రపంచం అవాక్కైంది. హృతిక్ రోషన్‌‌కు ఇలాంటి అసలైన సినిమా పడితే మరో ధూమ్ 2 అవుతుందని అంటున్నారు అభిమానులు. వార్ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. దీంతో టీజర్‌ను కూడా ఆయా భాషల్లో విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2jWtoLN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...