Wednesday, 10 July 2019

‘రాక్షసుడు’ వచ్చేస్తున్నాడు!

నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నా తనకంటూ ఇంకా మార్కెట్‌ను ఏర్పరుచుకోలేకపోతున్నాడు. ‘జయ జానకి నాయక’ హిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీనివాస్ ఆ తరవాత వరుస ఫ్లాపులతో వెనకబడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను ఎంపిక చేసుకున్నారు. ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ‘రైడ్‌’, ‘వీర’ చిత్రాల ద‌ర్శకుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మత్స ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎ. హ‌వీష్ ల‌క్ష్మణ్ కొనేరు ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్యనారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నారు. సినిమాపై నిర్మాత హ‌వీష్ కొనేరు మాట్లాడుతూ.. ‘త‌మిళంలో సూప‌ర్‌ డూప‌ర్‌ హిట్ అయిన ‘రాచ్చసన్’ చిత్రాన్ని తెలుగులో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌. ఈ చిత్రాన్ని ర‌మేష్‌ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్‌లో కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణాంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్‌గా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నాం’ అని చెప్పారు. కాగా, ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32i39AF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...