Tuesday, 16 July 2019

‘మన్మథుడు 2’.. నాగార్జున మొదలుపెట్టేశారు!

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘మ‌న్మథుడు 2’. మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం డ‌బ్బింగ్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్టు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చిత్ర ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు రెండు టీజర్లను విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ టీజర్‌లో నాగార్జునను, ఇతర పాత్రలను పరిచయం చేశారు. ఇటీవల వచ్చిన రెండో టీజర్‌లో అవంతిక (రకుల్ ప్రీత్ సింగ్)ను చూపించారు. ఈ రెండు టీజర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున వయసు మీద పడిన మన్మథుడిగా కనిపించనున్నారు. అప్పటి ‘మన్మథుడు’ సినిమా మాదిరిగానే ఈ పార్ట్ 2లోనూ డైలాగులు బాగానే పేలుతున్నాయి. తొలి టీజర్‌లో ఈ డైలాగులే హైలైట్. ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా? పోసిన నీళ్లు కూడా..’ అని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ భలే ఉంది. తాజాగా ఈ రెండు టీజర్లను కలుపుకుని ఒకే వీడియో కింద విడుదల చేశారు. ఈ టీజర్లు చూస్తుంటే వెండితెరపై మరోసారి నవ్వుల విందు ఖాయంగా కనిపిస్తోంది. కాగా, చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా ఆడియో విడుద‌ల‌, ట్రైల‌ర్ రిలీజ్ వేడుకల తేదీలను త్వరలోనే ప్రక‌టిస్తామ‌ని ద‌ర్శక నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో మెరవనున్నారు. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.ప్రసాద్‌, బి.నాగేశ్వర రెడ్డి ఎడిటర్లుగా పనిచేస్తున్నారు. కిట్టు విస్సాప్రగ‌డ‌, రాహుల్ ర‌వీంద్రన్‌ డైలాగులు రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2kb1sUo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...