Tuesday, 25 June 2019

అభిమాని కూతురికి నామకరణం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన చీఫ్ తన అభిమాని కూతురికి నామరణం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎర్రం అంకమ్మరావు పవన్ వీరాభిమాని. ఇటీవలే ఆయన భార్య ఇందిర పండంటి పాపకు జన్మనిచ్చింది. తన అభిమాన నటుడితో పాపకు నామకరణం చేయాలని భావించిన అంకమ్మరావు సతీసమేతంగా పాపను తీసుకొని జనసేనానిని కలిశారు. అభిమాని కోరిక మేరకు.. పవన్ కళ్యాణ్ ఆ పాపకు అని పేరు పెట్టారు. అనంతరం ఆ పాపను చేతుల్లోకి తీసుకొని ఆడించారు. దీంతో ఆ దంపతులు హ్యాపీగా ఫీలయ్యారు. గత ఏప్రిల్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమాని కుమారుడికి నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన నక్కా వెంకటేశ్వర రావు కుమారుడికి 2018 ఏప్రిల్‌లో బాబు జన్మించాడు. తన కొడుక్కి చిరంజీవి మాత్రమే పేరు పెట్టాలని అతడు భిష్మించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి.. తన తమ్ముడి పేరులోని పవన్, తన అసలు పేరు శివ శంకర ప్రసాద్‌లోని శంకర్ కలిసొచ్చేలా ఆ చిన్నారికి పవన్ శంకర్ అని పేరు పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2J3IZl2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...