మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi).. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాణించటమే కాకుండా సామాజిక సేవలోనూ తనవంతు బాధ్యతలను నిర్వహిస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి.. ఎంతో నటీనటులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన శక్తి. సామాన్యుడు ..మెగాస్టార్ కావటం అనేది వినటానికి బాగానే ఉంటుంది. కానీ ఆ స్థాయికి చేరటానికి చేసిన జర్నీ మాత్రం అసాధారణం. అచంచలమైన పట్టుదల, దీక్షతో చిరంజీవి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అగ్ర కథానాయకుడిగా బాక్సాఫీస్‌ను శాసించిన చిరంజీవి ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలెన్నో. అయితే ప్రతి పాఠాన్ని విజయంగా మార్చుకుంటూ తనకు తానుగా మెగా హిట్స్‌తో ఎవరూ అందుకోలేని రేంజ్‌కు చేరుకున్నారు. 1978లో పునాదిరాళ్ళు (Punadhirallu)తో చిరంజీవి తన సినీ జీవితాన్ని మొదలు పెట్టారు. ఆ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించినా ప్రాణంఖరీదు (Pranam Khareedu) చిత్రం ముందుగా విడుదలైంది. పునాది రాళ్లు మూడో చిత్రంగా విడుదలైంది. హీరోగానే కాకుండా, నెగిటివ్ షేడ్స్, కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తూ వచ్చారు చిరు. మనవూరి పాండవులు, తాయరమ్మ బంగారయ్య, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు, పున్నమినాగు, మొగుడు కావాలి, న్యాయం కావాలి, చట్టానికి కళ్ళులేవు, కిరాయిరౌడీలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, పల్లెటూరి మొనగాడు, అభిలాష, గూఢచారి నెం.1, మగమహారాజు’ వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు దక్కించుకున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7DhLOn4
v
No comments:
Post a Comment