సూపర్ స్టార్ అనే పదం వినటానికి బాగానే ఉంటుంది. కానీ అదొక బాధ్యత. టాలీవుడ్ చరిత్రలో సూపర్‌స్టార్ కృష్ణ (Super star Krishna) ఓ అధ్యాయం. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేశారు. ఆయన కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు.. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయడం సాధారణ విషయం కాదు. ఓ వైపు కుటుంబం మరో వైపు ప్రొఫెషనల్ లైఫ్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోన్న మహేష్.. ఈ రెండింటికీ ఆవల ఉన్న మరో కోణంలో సమాజానికి తన వంతుగా సేవను కొనసాగిస్తున్నారు. ఈ స్టార్ డమ్‌ను క్యారీ చేయటంలో మహేష్ ఎదుర్కొన్న ఒడిదొడుకులు ఎన్నో. నీడ సినిమాలో చిన్నప్పుడే మహేష్ (Mahesh) సినిమాల్లో అడుగు పెట్టారు. తర్వాత పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాల చంద్రుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించారు మహేష్. అయితే చదువును ఆలసత్వం చేయకూడదనే కారణంగా తండ్రికిచ్చిన మాట కోసం కొన్నాళ్లు పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నారు. చదువు పూర్తి కాగానే ఘట్టమనేని నట వారసుడిగా అంతకు ముందు కృష్ణ ఆశలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే గురుతర బాధ్యతలను తన భుజాలకెత్తుకున్నారు మన ప్రిన్స్ మహేష్.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/zvyTDGk
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment