గత నెలతో పోలిస్తే.. ఆగస్టు నెల సినిమా ఇండస్ట్రీకి కాస్త ఊరటనిచ్చింది. ఈ నెల మొదట్లో రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాల హిట్స్‌తో బాక్సాఫీసు కళకళలాడింది. అయితే ఆ తరువాత మళ్లీ ఫ్లాపులే పలకరించాయి. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. ఆ తరువాత కార్తికేయ-2 మూవీ విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్‌బాస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ముఖ్యంగా ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సుడిగాలి సుధీర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన వాంటెడ్ పండుగాడ్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తీవ్రంగా నిరాశపర్చింది. స్పోర్ట్స్ డ్రామాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక సెప్టెంబరు నెలలో అభిమానులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/n91NaWi
v
No comments:
Post a Comment