Thursday, 18 August 2022

ఆ హీరో సినిమా పోతుంద‌ని 5 రోజుల ముందే తెలిసింది.. ‘కార్తికేయ 2’ డైరెక్టర్ చందు మొండేటి వ్యాఖ్యలు

రొటీన్ క‌థ‌ల‌కు భిన్నంగా సినిమాల‌ను తెర‌కెక్కించాల‌నుకునే ద‌ర్శ‌కుల్లో చందు మొండేటి ఒక‌రు. ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. 2014లో కార్తికేయ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. తర్వాత చైత‌న్య‌తో ప్రేమ‌మ్‌, స‌వ్య‌సాచి సినిమాల‌ను డైరెక్ట్ చేశారు. నివేదా పేతురాజ్‌తో బ్ల‌డీ మేరీ సినిమాను తెర‌కెక్కించారు. అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యింది. కాగా.. తాజాగా కార్తికేయ 2 సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. నిజానికి కార్తికేయ 2 సినిమా ప్రేక్ష‌కులు ముందుకు రావ‌టానికి చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొంది. రిలీజ్ డేట్స్ మారాయి. చివ‌ర‌కు సినిమాను ఆగ‌స్ట్ 12న రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. అయితే ఒక‌వైపు లాల్ సింగ్ చ‌ద్దా.. మ‌రో వైపు మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం సినిమాలు పోటీలోకి వ‌చ్చాయి. దీంతో థియేట‌ర్స్ దొర‌క‌వేమోన‌ని అంద‌రూ భావించారు. చివ‌ర‌కు ఆ రోజున కూడా సినిమా వాయిదా ప‌డింది. సినిమాను ఆగ‌స్ట్ 13న రిలీజ్ చేశారు. ఆల‌స్య‌మైనా బాక్సాఫీస్ అదిరిపోయే స‌క్సెస్ మాత్రం సొంతం చేసుకుందా సినిమా. సినిమాను కొన్న బ‌య్య‌ర్స్ అంద‌రూ లాభాల‌ను గ‌డిస్తున్నారు. ముఖ్యంగా ఉత్త‌రాదిన సినిమా క‌లెక్ష‌న్స్ రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/1npotx6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...