Monday, 25 July 2022

‘ఆట’లో లైఫ్ ఉందా? మీకు తమ్ముళ్లు గుర్తు రారా? .. ఓంకార్‌పై ఆట సందీప్ భార్య ఘాటు వ్యాఖ్యలు

ఇస్మార్ట్ జోడీ, ఆట, మాయాద్వీపం, సిక్స్త్ సెన్స్ ఇలా తను చేసే షోలకు ఓన్ కంటెంట్‌తో తన మార్క్ చూపిస్తుంటారు ఓంకార్ (Omkar). యాంకర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఆయ‌న త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆట అనే డాన్స్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఓంకార్‌పై ఆట సందీప్ స‌తీమ‌ణి జ్యోతి రావ్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. కొరియోగ్రఫర్ ఆట సందీప్(aata sandeep), ఆయ‌న స‌తీమ‌ణి జ్యోతి రాజ్(Jyothi Raj) సోషల్ మీడియాలో వేసే స్టెప్పులు ఎంతలా వైరల్ అవుతుంటాయో అందరికీ విదిత‌మే.వీరిద్ద‌రూ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆట ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించిన ఓంకార్‌పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా జ్యోతి రాజ్ మాట్లాడుతూ ‘‘సాధారణంగా సందీప్ మనస్తత్వం సర్దుకుపోయేలా ఉంటుంది. కానీ నేను మనది తప్పులేనప్పుడు కొట్టొద్దాం అని అంటుంటాను. మన తప్పు లేనప్పుడు, మనం న్యాయంగా ఉన్నప్పుడు, మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి. ఎందుకు కాంప్ర‌మైజ్ కావాలి. ఎందుకు ఎప్పుడూ చేతులు క‌ట్టుకుని ఉండాలి. చేతులు క‌ట్టుకుని డౌన్ టు ఎర్త్ ఉండ‌టాన్ని నేను త‌ప్పు ప‌ట్టడం లేదు. ఇండ‌స్ట్రీలో డౌన్‌టు ఎర్త్ ఉంటే అంత పైకొస్తారు. దాన్ని నేను ఎప్ప‌టికీ న‌మ్ముతాను.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/zeY2ayG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...