నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హద్దులు చెరిపేస్తూ.. ఫ్యాన్స్‌కు అందాల విందు అందిస్తోంది. పుష్ప (Pushpa) మూవీతో ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ సినిమాతో ఏర్పడిన క్రేజ్‌తో ఈ బ్యూటీ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు రెడీ అవుతోంది. మిషన్ మజ్ను, గుడ్‌బై, యానిమల్ సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. దుల్కార్ సల్మాన్ 'సీతా రామం' మూవీలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. త్వరలో పుష్ప-2 మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఈ అందగత్తె. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో ఉన్న స్టిల్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 'సమ్‌థింగ్ మ్యాజికల్ ఫర్ యూ టుడే' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. క్రేజీ లుక్స్‌తో సూపర్ స్మైల్‌తో ఫొటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. లుకింగ్ బ్యూటీఫుల్, సో క్యూట్ అంటూ రష్మికను పొగేడుస్తున్నారు. ఈ బ్యూటీ ఫొటోలను షేర్ చేసుకుంటున్న నెటిజన్లు.. బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/MVejobN
v
No comments:
Post a Comment