ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తన కామెడీ టైమింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కమెడియన్ జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nokaraju). ఓ వైపు జబర్దస్త్ కామెడీ స్కిట్లకు స్క్రిప్ట్స్ రాస్తూ.. మరోవైపు కమెడియన్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఈ బుల్లితెర కమెడియన్ సాహసమే చేశాడు. తన ప్రియురాలిపై ఎంతో ప్రేమ ఉందో నిరూపించుకునేందుకు చేతిపై కర్పూరం వెలిగించుకున్నాడు. అది పూర్తిగా కాలిపోయే వరకు అలానే ఉన్నాడు. అంతేకాకుండా స్టేజ్‌పై ఆమె మెడలో తాళి కూడా కట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా క్యాష్ షో (Cash Show)లో జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నూకరాజు ఇప్పుడు రైసింగ్ స్టార్.. టైమింగ్ బాగుంది ఇలాగే తన కామెడీ కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మంచి స్టార్ అవుతాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TYoLQ9s
v
No comments:
Post a Comment