Wednesday 9 March 2022

అందరిముందే సుమకు లవ్ ప్రపోజల్.. మా ఆయనకు తెలిస్తే అంటూ యాంకర్ క్రేజీ రియాక్షన్

హోస్ట్ చేస్తున్న క్యాష్ షోలో జబర్దస్త్ కమెడియన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వేదికపైనే నేరుగా సుమకు ప్రపోజ్ చేయడం, దానికి సుమ స్ట్రాంగ్ రియాక్షన్ ఇవ్వడం లాంటి సీన్స్ హైలైట్ అయ్యాయి. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సర్క్యులేట్ అవుతోంది. మరి సుమకు ప్రపోజ్ చేసిన ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరు? ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి వెళదామా.. ఈ శనివారం ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఈ షోకి జబర్దస్త్ కమెడియన్స్ పొట్టి నరేష్, ఫైమా, అజర్, రీతూ తదితరులు హాజరై సందడి చేశారు. తనదైన మాటల తూటాలతో అందరిపై పంచుల మీద పంచులేసింది యాంకర్ సుమ. ఇంతవరకు బాగానే ఉన్నా సడెన్‌గా సుమ దగ్గరకు వచ్చిన నేరుగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. మేడం, మిమ్మల్ని చూసినప్పుడల్లా నా మనసులో ఏదో అవుద్ది అని చెబుతూ రోజా పువ్వుచ్చి ప్రపోజ్ చేశాడు. లవ్ చేస్తావా అని నేరుగా అడిగాడు. దీంతో మొదట ఆ రోజా పువ్వు తీసుకున్న సుమ.. ఆ తర్వాత నరేష్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 'పోరా జ‌ఫ్పా.. మా ఆయన చూస్తే నిన్ను ఇక్కడే పాతేసి.. నీ సమాధిపై ఈ రోజా పువ్వు పెడతాడు' అనేసింది. ఇకపోతే సుమ‌పై పంచ్‌ల వర్షం కురిపిస్తూ తెగ సందడి చేసిన పొట్టి నరేష్ చివరగా కాలుజారి కిందపడటం, ఆపై అంబులెన్సును చూపించడం పలు అనుమానాలకు కారణమైంది. నిజంగా నరేష్ కింద పడ్డాడా? లేక షోపై ఆసక్తి పెంచడానికి ఇలా చేశారా? అనేది ఫుల్ ఎపిసోడ్ ప్రసారమైతే గానీ చెప్పలేం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/dVa21pE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...