Saturday 5 March 2022

ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్.. కొత్త టైటిల్ కోసం మారుతి ప్రయత్నాలు!

బాహుబ‌లి ప్ర‌భాస్ సినిమాల‌ను ఎంపిక చేసుకోవ‌డంలోనూ, వాటిని పూర్తి చేయ‌డంలోనూ స్పీడు చూపిస్తున్నారు. అవ‌న్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం.రీసెంట్‌గా ప్ర‌భాస్ - మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల న‌డుమ మారుతి ఓ చిన్న కామెడీ జోన‌ర్‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను చేయాల‌నుకున్నారు. అదే స‌మ‌యంలో మారుతి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. సినిమాను మారుతి చాలా త్వ‌ర త్వ‌ర‌గా పూర్తి చేసేస్తారు. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కావ‌డంతో ఎక్క‌డా టైమ్ వేస్ట్ లేకుండా సినిమాను ప్లాన్ చేసుకున్నారు మారుతి. అక్క‌డా ఇక్క‌డా ప‌రిగెత్తాలి, ఏదో చేసేయాల‌ని కాకుండా మారుతి సినిమాను సెట్స్‌లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌భాస్ సినిమా కోసం ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు యువీ క్రియేష‌న్స్ మేక‌ర్స్‌. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటార‌ని అందులో ఇప్ప‌టికే రాశీ ఖ‌న్నా, మాళవికా మోహ‌న‌న్ ఓకే అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాస్ చాలా త‌క్కువ రోజులే ఈ సినిమాకు కేటాయించార‌ని కూడా వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా.. మ‌రో వైపు ఈ సినిమాకు రాజా డీల‌క్స్ అనే టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్లు న్యూస్ చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ కావ‌డంతో ఆయ‌న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మంచి టైటిల్ కూడా పెట్టాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు అనుకుంటున్నార‌ట‌. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పీరియాడిక్ ల‌వ్ స్టోరి ‘రాధే శ్యామ్’.. మార్చి 11న రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా ఇప్ప‌టికే ప్ర‌భాస్ కిట్టీలో చాలా పాన్ ఇండియా సినిమాలున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ‘స‌లార్’ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఓం రౌత్ మూవీ ‘ఆది పురుష్’ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. నాగ్ అశ్విన దర్శకత్వంలో చేస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ జరుగుతుంది. మరో వైపు సందీప్ వంగ దర్శకత్వంలో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ స్టార్ట్ కావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/j5l8pTA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...