Wednesday 9 March 2022

మై లడ్కీ అంటూ హీరోయిన్ ఫొటోలు.. మతి పోగొట్టేలా ఆర్జీవీ కెమెరా యాంగిల్స్

సంచలనాలకు మారు పేరైన వరుసపెట్టి డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జయాపజయాల సంగతి పక్కనపెట్టి తనదైన కోణంలో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే వర్మ నుంచి ఎక్కువగా హీరోయిన్లను ఎలివేట్ చేసే సినిమాలే వస్తుండటం చూస్తున్నాం. ఇక ఆయా సినిమాల ప్రమోషన్స్ విషయంలో చాలా డిఫరెంట్‌ వేలో వెళ్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా '' సినిమాకు సంబంధించి ఆయన వదులుతున్న పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ 'లడ్కీ' మూవీ రూపొందించారు వర్మ. ఇందులో హీరోయిన్ పూజా భలేకర్ లీడ్ రోల్ పోషించింది. అయితే త్వరలోనే ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేసిన వర్మ.. చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూజా భలేకర్ వర్కవుట్ వీడియో వదిలి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇక అంతటితో ఆగక మై లడ్కీ అంటూ వరుసపెట్టి పూజా భలేకర్ హాట్ స్టిల్స్ వదిలారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవర్‌ఫుల్ సెక్సీ విమెన్ అంటూ ఆర్జీవీ వదులుతున్న ఈ ఫొటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. లేడీ పవర్ చూపిస్తూనే అందాలతో అట్రాక్ట్ చేసేలా ఈ ఫొటోస్ ఉన్నాయని, ఆర్జీవీ కెమెరా యాంగిల్స్ మామూలుగా లేవనే కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఆర్ట్‌సి మీడియా, చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లడ్కీ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్‌లీ నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రానికి నివాళిగా తెరకెక్కించినట్లు తెలిపారు. దాదాపు అన్ని జోనర్లలోనూ టచ్ చేస్తూ ఈ మధ్య కాలంలో సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తూ పలు వివాదాల్లో దూరుతున్నారు రామ్ గోపాల్ వర్మ. రాజకీయ నేపథ్యమున్న సినిమాలతో పాటు గ్లామర్ డోస్ దట్టిస్తూ కుర్రకారును హీటెక్కించే మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే ''క్లైమాక్స్, నగ్నం, డేంజరస్, జీఎస్టీ'' లాంటి సినిమాలు రూపొందించి రచ్చ చేసిన వర్మ.. ఇక ఈ 'లడ్కి'తో ఎలాంటి సునామీ సృష్టిస్తారో చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/rmG3F0L
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...