Wednesday 9 March 2022

సర్కారోడు రామ్ చరణ్.. జనాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్!

టాలీవుడ్‌లో భారీ రేంజ్ సినిమాలు ఊపందుకున్నాయి. స్టార్ హీరోలంతా వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రంలో రామ్ చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా టైటిల్ విషయమై జనాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మూవీకి 'సర్కారోడు' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ నేపథ్యంలో భారీ రేంజ్ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనేదే ఈ సినిమా స్టోరీ అంటున్నారు. స్టోరీకి సరిగ్గా యాప్ట్ అయ్యేలా ఈ అనే టైటిల్ ఎంచుకున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆయన బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. అందుకే ఈ సినిమాను భారీ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని, చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని దిల్ రాజు భావిస్తున్నారట. అందుకు తగ్గట్లుగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్క్‌ కూడా కనిపించనుందని తెలుస్తుండటం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ లపై షూట్ చేసిన ''ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది'' సాంగ్ రీమేక్‌లో రామ్ చరణ్ కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ సినిమాలో తమన్ బాణీలు మరో లెవెల్‌లో ఉండబోతున్నాయట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/cHgGkz9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...